IOCL Recruitment 2024 ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ పోస్టులు డిప్లొమా, ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు
Indian Oil Corporation Limited : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 88 పోస్టుల భర్తీకి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..
IOCL Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 88 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అటెండెంట్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ జులై 22 నుంచి ప్రారంభమైంది.. ఆగస్టు 21 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు – 88
ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 38 పోస్టులు
టెక్నికల్ అటెండెంట్ – 29 పోస్టులు
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ – 21 పోస్టులు
విద్యార్హతలు
ఇంజినీరింగ్ అసిస్టెంట్ : ఈ పోస్టులకు అభ్యర్థులు రిలవెంట్ డిసిప్లైన్లో ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
టెక్నికల్ అటెండెంట్ : ఈ పోస్టులకు అభ్యర్థులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి.
జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ : ఈ పోస్టులకు అభ్యర్థులు బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి
దరఖాస్తు దారులు july 31, 2024 నాటికి 18 మరియు 26 కలాం మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీలు, ఎస్సీలు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ : అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, మెరిట్ సాధించిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం ఉంటుంది. టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.23,000 నుంచి రూ.78,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం ఇలా :
- మొదట IOCL అధికారిక వెబ్సైట్ https://iocl.com/ ఓపెన్ చేయాలి.
- Whats New సెక్షన్లోకి వెళ్లి.. ‘రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్-ఎగ్జిక్వూటివ్ పర్సనల్ 2024 రిఫైనరీ అండ్ పైప్‌లైన్
- డివిజన్ 2024’పై క్లిక్ చేయాలి.
- తరువాత Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
- వెంటనే మీ మెయిల్‌కు ఒక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది.
- వాటితో మళ్లీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫామ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని.. అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : జులై 22, 2024
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 21, 2024