Crop waiver Loan : బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాప్ లోన్ తీసుకున్నవాళ్లకు రూ .2 లక్షల రుణమాఫీ
రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి తెలంగాణ రైతులకు శుభవార్త వినిపించింది. బాకీ ఉన్న రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాల్లాగే.. ఈ రైతు రుణమాఫీకి కూడా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 వరకు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగా, ఇప్పటికే మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలు ప్రక్రియపై కసరత్తు చేసిన అధికారులు తాజా మార్గదర్శకాలను విడుదల చేశారు.
రైతు రుణమాఫీ పథకం కింద గురువారం సాయంత్రానికి లక్ష రూపాయల వరకు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతులంతా రేపటి కోసం ఎదురు చూస్తున్నారు.
బ్యాంకుల్లో బంగారం వేసి పంట రుణాలు తీసుకున్న వారి పాస్ బుక్ ఉంటేనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా మినహాయింపు ఉంటుంది.
ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల రుణాలు మాఫీ కాదన్నారు మంత్రి. 11.50 లక్షలు రూ. రూ.కోట్లు బ్యాలెన్స్ ఉందన్నారు. వారి కోసం ఎల్లుండి నుంచి 6000 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తిస్తుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. రాష్ట్ర షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల శాఖల నుండి రైతులు పొందే పంట రుణాలకు ఇది వర్తిస్తుంది.
Decembar 12, 2018న లేదా ఆ తర్వాత మంజూరు చేయబడిన లేదా పునరుద్ధరించబడిన Loanలకు మరియు
Decembar 09, 2023 వరకు Loan ఉన్న పంట రుణాలకు ఇది వర్తిస్తుంది. 09 డిసెంబర్ 2023 నాటికి బకాయి ఉన్న అసలు మరియు వడ్డీ మొత్తం ఈ పథకానికి అర్హులు