Electric Vehicle : ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుగోలు చేసే వారికి గుడ్‌న్యూస్.. మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
మీరు ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలి అనుకుంటున్నారా.. అయితే. ఇదే సరైన టైమ్ అనుకోవచ్చు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం EV లను కొనేవారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి.
ఇండియాలో సడెన్‌గా ఎలక్ట్రిక్ వాహనాల Electric Vehicle న్యూస్ బాగా వస్తోంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. కారణం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలే. జనరల్ గానే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ( Electric Vehicle Purchase ) ఆసక్తి చూపిస్తున్నారు కానీ, ఛార్జింగ్ స్టేషన్లు లేవన్న కారణంతో ఒకింత వెనక్కి వెళ్తున్నారు. ఐతే.. ఎలాగైనా వాటినే కొనిపించాలని ప్రయత్నిస్తున్న కేంద్రం సబ్సిడీలు ఇవ్వడం చూస్తున్నాం. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఈవీల సేల్స్ మరింత పెంచేలా ఉన్నాయి.
ఈవీ (Electric Vehicle) రోడ్ మ్యాప్‌పై నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) మాట్లాడారు. పుణెలో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ దగ్గర జరిగిన ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా భారత యువత టాలెంట్‌ని మెచ్చుకున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ రేట్ బాగా పెరిగిందని అన్నారు. ఇండియాలో ఈవీల వాడకం బాగా పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి అన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 40 లక్షలకు చేరుతుందనీ, వచ్చే 2 ఏళ్లలో ఈ సంఖ్య 3 కోట్లకు చేరుతుందని అన్నారు.
ఈవీ సెగ్మెంట్‌లో చాలా స్టార్టప్స్ వస్తున్నాయని గడ్కరీ అన్నారు. ఇది మంచిదే అన్న ఆయన.. దీని వల్ల స్టార్టప్స్ మధ్య పోటీ పెరిగి.. తక్కువ ధరకు నాణ్యమైన ఈవీలు అందుబాటులోకి వస్తాయి అన్నారు. పెద్ద బ్రాండ్స్ ఈ మార్కెట్‌లో మంచి ఉత్పత్తులు తేవగలవు అని ఆశించారు.
నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) మరో మాట కూడా అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలా కాకుండా.. ఇథనాల్, మెథనాల్, బయోCNG, బయో డీజిల్ వంటి ఆప్షన్స్ కూడా వినియోగదారులకు ఉండేలా.. ఆటోమొబైల్ కంపెనీలు మార్పులు తేవాలని కోరారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల టయోటా మిరాయ్ పైలట్ ప్రాజెక్టును ఇండియాలో ప్రారంభించారు.