Toll fee : కేంద్రం కొత్త రూల్.. ఫాస్టాగ్ ఉన్నా అలా చేస్తే డబుల్ టోల్ ఛార్జీలు !
Toll charges: వాహనదారులకు పెద్ద హెచ్చరిక టోల్ ఛార్జీలకు సంబంధించి కొత్త నిబంధనలు. FAStag ఉన్నా ఈ చిన్న పొరపాటు చేస్తే రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త రూల్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఫాస్టాగ్‌తో ఎలాంటి లోపాలను నివారించడం ఎలా? తెలుసుకుందాం.
Toll charges: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు పెద్ద హెచ్చరిక. టోల్ ఛార్జీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు టోల్ గేట్ల వద్ద వాహనాల వేగాన్ని పెంచేందుకు మరో నిబంధనను అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగా, ముందు అద్దాలకు ఫాస్ట్‌ట్యాగ్‌ను అమర్చని వాహనదారుల నుండి రెట్టింపు టోల్ వసూలు చేయాలని NHAI నిర్ణయించింది. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నప్పటికీ, అద్దానికి అతికించకుంటే రెట్టింపు టోల్ చెల్లించాల్సి వస్తుందని వాహనదారులు గుర్తుంచుకోవాలి.
ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గురువారం రెండు టోల్ ఛార్జీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. FAStag ఉద్దేశపూర్వకంగా విండ్‌స్క్రీన్‌కు అతికించకపోవడం వల్ల టోల్ గేట్ల వద్ద అనవసరమైన జాప్యం జరుగుతుందని NHAI ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. వాహనం ముందు అద్దానికి ఫాస్ట్‌ట్యాగ్‌ను అతికించాలని స్పష్టం చేశారు. దీని ద్వారా టోల్ గేట్ల వద్ద వాహనాన్ని త్వరగా గుర్తించి గేటు తెరవవచ్చని చెబుతున్నారు.
ఫాస్ట్‌ట్యాగ్‌ను అతికించనందుకు రెట్టింపు రుసుమును విధించే చర్య టోల్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా చేయడానికి మరియు జాతీయ రహదారి వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో సహాయపడుతుంది. “ఫ్రంట్ విండ్‌షీల్డ్‌పై ఫాస్ట్‌ట్యాగ్ అతికించకుంటే రెట్టింపు యూజర్ ఫీజు వసూలు చేసేందుకు అన్ని యూజర్ ఫీజు వసూలు చేసే ఏజెన్సీలు మరియు రాయితీదారులకు వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు జారీ చేయబడ్డాయి,” అని అందరికీ తెలియజేయడానికి అన్ని టోల్ ప్లాజాల వద్ద హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తామని జాతీయ రహదారుల అథారిటీ NHAI తెలిపింది FAStag ని అతికించకుండా టోల్ గేట్‌లోకి ప్రవేశించే వారికి జరిమానాలు తెలియజేయబడతాయి మరియు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయబడుతుంది.